Aryan Khan: ఎన్సీబీ ఎదుట హాజరైన ఆర్యన్ ఖాన్
Aryan Khan: ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్‌కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు షరతు...
Aryan Khan: ఎన్సీబీ ఎదుట హాజరైన ఆర్యన్ ఖాన్
Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు, ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు నిందితుడు ఆర్యన్ ఖాన్ ఇవాళ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు హాజరయ్యాడు. ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ సేవిస్తూ అక్టోబర్ 2న NCB అధికారులకు పట్టుబడ్డాడు. దాదాపు 27 రోజులు జైలు జీవితం అనంతరం అక్టోబర్ 30న బెయిల్‌పై విడుదలయ్యాడు.
అయితే ప్రతి శుక్రవారం NCB ఆఫీస్‌కు వెళ్లి సంతకం చేయాలనేది కోర్టు విధించిన షరతుల్లో ఒకటి. కోర్టు ఆదేశాల ప్రకారం దక్షిణ ముంబైలోని NCB ముందు ఆర్యన్ ఖాన్ హాజరయ్యాడు.