Arvind Kejriwal: ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన..!

Arvind Kejriwal: ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-03-14 15:00 GMT

Arvind Kejriwal: ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన..!

Arvind Kejriwal: ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్‌లోని 200, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. భోపాల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీ అంటే ప్రధాని మోడీకి భయమని కేజ్రీవాల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిన తీరును కేజ్రీవాల్ తప్పుబట్టారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూరగాయల మార్కెట్‌గా మార్చారని కేజ్రీవాల్ విమర్శించారు.

Tags:    

Similar News