Assam Violence: అస్సాంలో మళ్లీ చెలరేగిన హింస: బోడో-ఆదివాసీల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, రణరంగంగా మారిన కోక్రాఝర్!

Assam Violence: అస్సాంలో బోడో మరియు ఆదివాసీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు. కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ కట్, నిషేధాజ్ఞలు విధింపు. సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందన.

Update: 2026-01-21 06:03 GMT

Assam Violence: అస్సాంలో మళ్లీ చెలరేగిన హింస: బోడో-ఆదివాసీల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, రణరంగంగా మారిన కోక్రాఝర్!

Assam Violence: అస్సాంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బోడో, ఆదివాసీ తెగల మధ్య తలెత్తిన వివాదం హింసకు దారితీసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌‌ను మోహరించింది. హింస చెలరేగిన కోక్రాఝర్, చిరాంగ్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయడంతో పాటు నిషేదాజ్ఞాలు విధించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టంచేశారు.

కోక్రాఝర్‌ పీఎస్‌ పరిధిలోని కరిగావ్‌ అవుట్‌ పోస్ట్‌ వద్ద ముగ్గురు బోడో వ్యక్తులతో వెళ్తోన్న వాహనం.. ఇద్దరు ఆదివాసీలను సోమవారం ఢీ కొట్టింది. దీంతో ఆగ్రహించిన స్థానిక ఆదివాసీలు.. నిందితులపై దాడి చేశారు. వాహనానికి నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో నిందితుల్లో ఒకరు చనిపోయారు. ఈ క్రమంలో కరిగావ్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద ఇరు తెగలు ఘర్షణకు దిగాయి. జాతీయ రహదారిపై బైఠాయించాయి.టైర్లను కాల్చేశాయి. కొన్ని ఇళ్లకు నిప్పంటించాయి. ఈ ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించారు. ప్రజలతోపాటు, కొందరు పోలీసులూ గాయపడ్డారు. ఘటనాస్థలంలో సైన్యాన్ని మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ‘ఎక్స్‌’ వేదికగా సీఎం హిమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ సమావేశంలో ఉన్నారు.

Tags:    

Similar News