Arvind Kejriwal: జూన్ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త..
Arvind Kejriwal: తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు
Arvind Kejriwal: జూన్ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త..
Arvind Kejriwal: మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తీహార్ జైళ్లో మళ్లీ తాను లొంగిపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను జైల్లో ఉన్నా... నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.లోక్‌సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తి కానుంది. ఎల్లుండి స్వయంగా వెళ్లి జైల్లో లొంగిపోతానని కేజ్రీవాల్ తెలిపారు. అయితే.. ఈసారి ఎన్ని రోజులు.. ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తనకు తెలియదన్నారు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు తాను జైలుకి వెళ్తున్నానంటూ వ్యాఖ్యానించారు.