కాలుష్యంపై కలిసి పోరాడుదాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : పర్యావరణ కాలుష్యాన్నితగ్గించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యంపై కలిసికట్టుగా పోరాడదామని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Update: 2020-10-19 15:07 GMT

Arvind Kejriwal : పర్యావరణ కాలుష్యాన్నితగ్గించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యంపై కలిసికట్టుగా పోరాడదామని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి పోరాటమే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీల భాగస్వామ్యం అవసరమని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇందుకు చేతులు కలపాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని నాలుగేళ్ల కనిష్టానికి తగ్గించగలమని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నెల నెల చర్చలు జరిపి పర్యావరణ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు, పార్టీల మధ్య వైరాలు, రాజకీయాలు పక్కన పెట్టి కాలుష్య నియంత్రణకు అందరూ నడుం బిగించాలని కేజ్రీవాల్ సూచించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా.. సరిహద్దు రాష్ట్రాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. ఇండియాలోని అనేక పట్టణాలు ఈ లిస్టులో ఉన్నాయి.


Tags:    

Similar News