Rs 18000 per month as a salary for priests and granthis - Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి విజయం సాధిస్తే.. దేవాలయాల పూజారులు ( Temple priests), గురుద్వారాల గ్రంథిలకు (గురుద్వారాల్లో పూజారి తరహాలో ఉండే సిక్కు మత పెద్దలు) నెలకు రూ.18 వేల వేత్తనాన్ని చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. హనుమాన్ ఆలయంలో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.. ఆలయాల్లో పూజారులకు, గురుద్వారాల్లో గ్రంథులకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం అందజేస్తామని ప్రకటించారు (Arvind Kejriwal announced election promise of Rs. 18000 per month salary for priests).
మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. పురోహితులు, గ్రంథీలు మన ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని చెప్పారు. మళ్లీ మేం అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ.18 వేల గౌరవ వేతన అందిస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుంచే ప్రారంభమవుతుందని అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)వెల్లడించారు. ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని ఈ సందర్భంగా బీజేపీని అభ్యర్థిస్తున్నానని.. ఈ ప్రక్రియను అడ్డుకుంటే పాపం చేసినట్టే అవుతుందన్నారు కేజ్రీవాల్.
ముందుగా సీనియర్ సిటిజన్ల కోసం సంజీవని పథకం, ఆ తర్వాత మహిళా సమ్మాన్ యోజన ప్రకటించింది. సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించనుంది. మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2100 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా అర్చకులకు నెలవారీ వేతన పథకాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు.