Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు
Chardham Yatra: రుద్రప్రయాగ్‌లో జోరుగా కురుస్తున్న మంచు వర్షం
Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు
Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. అయితే ప్రస్తుతం రుద్రప్రయాగ్‌లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో మంచును తొలగించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. రహదారిపై గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తూ... రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తున్నారు. చార్‌ధామ్ యత్ర ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడినప్పటికీ భక్తులు పరమ పవిత్రంగా భావించి యాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వేలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.