Kerala: కేరళలో గవర్నర్-సీఎం మధ్య ముదిరిన వివాదం
Kerala: సీఎం విజయన్ తనను దారణంగా హర్ట్ చేశారన్న గవర్నర్
Kerala: కేరళలో గవర్నర్-సీఎం మధ్య ముదిరిన వివాదం
Kerala: కేరళలో అక్కడి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ‌్య మరో కొత్త వివాదం నెలకొంది. తన వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆరోపించారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ టూర్ కోసం తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆగ్రహంతో కారు నుంచి బయటికి దిగిన గవర్నర్.. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు సీఎం విజయన్ కుట్ర పన్నుతున్నారని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆరోపించారు.
తన వాహనంపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.యూనివర్సిటీల్లో నియామకాలపై గవర్నర్ తీరుకు నిరసనగా అధికార సీపీఎంకి చెందిన విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కారును అడ్డుకోవడంతో ఆయన సీఎంపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చాలాకాలంగా గవర్నర్, కేరళ సీఎంల మధ్య వివాదం కొనసాగుతోంది.