ఢిల్లీలో తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ

Update: 2025-07-16 10:37 GMT

తెలుగు రాష్ట్రాల నీటి వనరులపై కీలక చర్చలకు కేంద్రం వేదికైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల వినియోగం, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదాల పరిష్కారానికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.

Tags:    

Similar News