Student Suicide: కోటాలో మరో విద్యార్థి సూసైడ్..ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..!!

Update: 2025-05-26 07:09 GMT

Student Suicide: కోటాలో మరో విద్యార్థి సూసైడ్..ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..!!

Student Suicide: రాజస్థాన్ కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా నీట్ కు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంది. జమ్ముకశ్మీర్ కు చెందిన జీషన్ అనే విద్యార్థిని కోటాలోని ప్రతాప్ చౌరహా అనే ప్రాంతంలో హాస్టల్ పేయింగ్ గెస్టుగా ఉంటూ వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ కు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తానుంటున్న రూమ్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అంతకుముందు తన బంధువులతో ఫోన్లో మాట్లాడిందని..తాను చనిపోతున్నట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు.

ఆమె వెంటనే అదే బిల్డింగ్ లో పై అంతస్తులో ఉంటున్న మమత అనే మరో విద్యార్థినికి విషయం చెప్పినట్లు తెలిపారు. ఆమె జీషన్ గదికి వెళ్లి చూడగా అప్పటికే తలుపులు లాక్ చేసుకుందని..మమత అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వాటిని బద్దలు కొట్టారని..అప్పటికే ఆమె సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. దీంతో వారు జీషన్ ను హుటాహుటినాఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కోటాలో 15 మంది విద్యార్థులు మరణించారు. ఈ నెలలో ఇది రెండో సూసైడ్.

Tags:    

Similar News