Corona Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌కు మరో మైలురాయి

Corona Vaccine: ఒక్క రోజులో 10లక్షల మందికి పైగా టీకా * నిన్న 10లక్షల 93వేల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

Update: 2021-03-05 06:07 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఫోటో)

Corona Vaccine: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. కొత్తగా 16వేల 838 కరోనా కేసులు నమోదు కాగా 113 మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి 11లక్షల 73వేల 761 కరోనా కేసులు రికార్డు కాగా భారత్‌లో లక్షా 57వేల 548 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం లక్షా 76వేల 319 మంది బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక కరోనాను తరిమికొట్టాలని జరుగుతున్న పోరాటంలో మరో మైలురాయిని సొంతం చేసుకుంది ఇండియా. ఒక్క రోజులోనే 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న రాత్రి 7 గంటల వరకూ 10 లక్షల 93 వేల మందికి టీకా అందించామని, జనవరి 16న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన తరువాత, ఒక్కరోజులో ఇంతమందికి టీకా అందించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాను అందిస్తున్నారు. అతి త్వరలో సామాన్యులకు కూడా టీకా అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. మరోవైపు భారత్‌లో నమోదవుతున్న తాజా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. 

Tags:    

Similar News