Amit Shah assures on capital: ఢిల్లీలో ప‌రిస్థితి గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు : అమిత్ షా

Amit Shah assures on capital:దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

Update: 2020-06-28 13:58 GMT

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని కొన్ని రాష్ట్రాలలో(Amit Shah assures on capital) కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాలలో ఢిల్లీ ఒకటి.. శనివారం రోజున కొత్తగా అక్కడ 2,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి అక్కడ కరోనా కేసుల సంఖ్య 80,188 కి చేరుకుంది. అయితే ఇందులో 28,329 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే.. తాజాగా జూన్ 9న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియా జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆసుప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందని, ఇక జులై చివరి వరకు ఢిల్లీలో 2.5 ల‌క్షలు, జూలై 31 నాటికి 5.5 ల‌క్షలకు చేరుకుంటాయ‌ని అయన చేసిన వాఖ్యాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. అయన వాఖ్యలు ఢిల్లీ ప్రజ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేలగా ఉన్నాయని అమిత్ షా అన్నారు. . అయితే ఆయన అంచ‌నా స‌రైన‌దా? కాదా? అని విష‌యంపై నేను మాట్లాడబోనని అమిత్ షా వాఖ్యానించారు. ఇక కరోనా పరిస్థితి గురించి ఇప్పటికే నీతి ఆయోగ్‌కు చెందిన పలువురు డైరెక్టర్ లతో మాట్లాడానని అన్నారు. ఢిల్లీలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కేసులు బయటకు వస్తున్నాయని, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వస్తే రోజురోజుకు కరోనా ఉధృతి పెరిగిపోతుంది. రికార్డుస్థాయిలో రోజురోజుకీ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,906 కేసులు నమోదు అయ్యాయి.. కరోనా మొదలు నుంచి ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 5,28,859 కి చేరింది. ఇక మరణాల సంఖ్య 16,095కు చేరుకుంది.

 

Tags:    

Similar News