అగ్నిపథ్ పథకంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమీక్ష
Rajnath Singh: త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నతస్థాయి సమావేశం
అగ్నిపథ్ పథకంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమీక్ష
Rajnath Singh: అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ.. ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో రెండు సార్లు అగ్నిపథ్ పథకంపై రాజ్‌నాథ్‌సింగ్ సమీక్ష నిర్వహిస్తుండం గమనార్హం.
ఈ భేటీలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ, హోంశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనన్న చర్చ ప్రారంభమైంది. మధ్నాహ్నం 2గంటలకు త్రివిధ దళాధిపతుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అగ్ని వీరులకు మరిన్ని వివరాలు ఇస్తారా లేదా ఉపసంహరణ చేస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.