ఐటీ శాఖ సంచలన నిర్ణయం.. 14 లక్షల మందికి లబ్ధి

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని రంగాల‌ను దెబ్బ‌తీసింది. దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతుంది.

Update: 2020-04-08 14:38 GMT
Representational image

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని రంగాల‌ను దెబ్బ‌తీసింది. దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. దీంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్ కంట్యాక్స్ డిపార్ట్ మెంట్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఆదాయ‌పన్ను శాఖ జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కంటే త‌క్క‌వ ఉన్న పెండింగ్ ఇన్ కం టాక్స్ రీఫండ్స్ అన్ని రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఐటీ డిపార్ట్ మెంట్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో 14ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొంద‌నున్నారు. దాదాపు ల‌క్ష సంస్థలకు, అంటే చిన్న‌, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరనున్నట్టు ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. 18వేల కోట్ల రూపాల‌య‌ను వెంటనే రీఫండ్ చేయడానికి ఆమోదం ప్ర‌క‌టించింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం లక్షా 70వేల కోట్ల రూపాయ‌ల‌తో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా కొన్ని ఉపశమనాలు కల్పించింది. 100 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులు... 90 శాతం మంది 15వేల రూపాయ‌ల వేత‌నాలు కంటే తక్కువ నెలసరి వేతనాలు అందుకుంటుంటే... పీఎఫ్ నిధులను దాదాపు మూడు నెల‌లు కేంద్రం చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీని వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలగనుంది. లాక్ డౌన్ స‌మ‌యంలో ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం కంపెనీలకు ఊరట కలిగించే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



Tags:    

Similar News