Air India Flight Crash: ఘోర విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం సహా పలువురి మృతి?
అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. గుజరాత్ మాజీ సీఎం సహా 242 మంది మృతి చెందినట్లు అనధికార సమాచారం. ఘటనకు కారణం సాంకేతిక లోపమేనా?
Air India Flight Crash: ఘోర విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం సహా పలువురి మృతి?
అహ్మదాబాద్| జూన్ 12, 2025:
అహ్మదాబాద్‌లోని విమానాశ్రయంలో Air India విమానం భయంకర ప్రమాదానికి గురైంది. లండన్‌కు వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదంలో 242 మంది దుర్మరణం చెందినట్లు అనధికార సమాచారం వెలువడుతోంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం ఉన్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.
📌 టేకాఫ్ సమయంలోనే ఇంజిన్ వైఫల్యం..?
విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. మేఘనినగర్ సమీపంలో ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. భయానకంగా పేలిన ఆ విమానం వస్త్రపూర్ వరకు పొగలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన మంటలు, పొగతో కమ్ముకుపోయింది.