AICC Presidential Poll: రేపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు..

AICC Presidential Poll: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్

Update: 2022-10-16 13:54 GMT

AICC Presidential Poll: రేపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. 

AICC Presidential Poll: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీకాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల పర్యవేక్షణకి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉన్నితన్, ఏపిఆర్వోగా భగేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుండి ఓటు హక్కును పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డితో పాటు 238 డెలిగెట్స్ వినియోగించుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష భరిలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ ఉన్నారు.

ఏఐసీసీ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ డెలిగేట్ల పోలింగ్ వ్యవహారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 350 మంది పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో ఇది మరో అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. 

Tags:    

Similar News