Third Wave: ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ సంక్షోభం..?

Third Wave:మళ్లీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు * పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూ

Update: 2021-07-25 04:12 GMT

Representational Image

Third Wave: కోవిడ్‌ వైరస్‌ తొలిదశ విజృంభణ దేశాన్ని కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌ ప్రాణ భయం పుట్టిస్తూ హడలెత్తించింది. ఇప్పుడు మూడో దశ ముప్పు భయపెడుతోంది. రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు పాజిటివిటీ రేటు నిలకడగా ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 15 నుండి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ కూడా ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది.

దేశంలో పాజిటివ్‌ కేసుల నమోదులో కేరళ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర రెండోది. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్రల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఆగస్టులోనే మూడో దశ ప్రారంభం అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడోదశను దృష్టిలో పెట్టుకునే కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు దేశవ్యాప్తంగా 67శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉందని సీరో సర్వే ద్వారా వెల్లడవుతుంది. కానీ రెండోదశ భీభత్సాన్ని హెర్డ్‌ ఇమ్యూనిటీ నియంత్రించలేకపోయింది. మూడో దశ ప్రభావం తొలి రెండుదశల స్థాయిలో ఉండొచ్చని వైద్యులు అంచనావేస్తున్నారు. జాగ్రత్త వహించకపోతే మాత్రం మరింత ప్రమాదస్థాయిని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News