Coronavirus: కేరళలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Coronavirus: థర్డ్ వేవ్ సంకేతమా..? * వరుసగా నాలుగో రోజు కూడా 20వేలకు పైగా కేసులు

Update: 2021-07-31 02:22 GMT

Representational Image

Coronavirus: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పదివేలకు పైగా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో మరణాలు రికార్దవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ తగ్గి అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్న సమయంలో కేరళలో పాజిటివ్ కేసులు పెరగడం థర్డ్ వేవ్‌కు హాట్ స్పాట్‌గా మారిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రభుత్వాన్నే కాదు.. కేంద్రాన్ని కూడా కలవరానికి గురి చేస్తోంది. ఒక నిపుణుల టీంను కేరళకు పంపి పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించింది. కరోనాను సమర్థవంతగా కట్టడి చేస్తున్నారన్న రాష్ట్రంలో థర్డ్ వేవ్ స్టార్ట్ కావటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి నుంచి కరోనా లాక్‌డౌన్, భౌతిక దూరం, మాస్క్‌లను ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ కావడం వెనుక అసలు కారణం ఎంటన్నది ప్రశ్నగా మారింది. దేశంలో థర్డ్ వేవ్‌ కు కేరళ హాట్ స్పాట్‌గా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క కేరళ నుంచే నమోదువుతున్నాయి. దీంతో అక్కడ మరింత కఠినంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.

Tags:    

Similar News