Afghanistan: ఆప్ఘనిస్థాన్‌ లో బాంబు పేలుడు...55 మంది మృతి

Afghanistan: కాబూల్‌లోని ఓ పాఠశాల వద్ద జరిగిన బాంబు పేలుడులో 55 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు

Update: 2021-05-09 05:45 GMT

ఆఫ్ఘానిస్తాన్ బాంబు పేలుడు ఘటన (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. రాజధాని కాబూల్‌లోని ఓ పాఠశాల వద్ద నిన్న జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 55మంది దుర్మరణం పాలయ్యారు. మరో 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కాబూల్ జిల్లాలోని దస్తార్-ఎ-బార్చిలోని సయ్యద్ అల్ షుహాదా బాలికల ఉన్నత పాఠశాల వ‌ద్ద పేలుడు జ‌రిగింది. ఈ స‌మ‌యంలో బాలికలు పాఠశాల నుంచి ఇళ్ల కు బయల్దేరుతుండగా  మొదట కార్ బాంబు పేలింది. తర్వాత రెండు రాకెట్లను పేల్చారు. మృతుల్లో వీరిలో అత్యధికులు విద్యార్థులేనని, అది కూడా 11-15 ఏళ్ల మధ్య వయసున్న వారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దారుణంపై తాలిబన్లు స్పందించారు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ కాబూల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపైనా దాడి చేశారు. క్షతగాత్రులు, మృతదేహాలతో సమీపంలోని ఆసుపత్రులు నిండిపోయాయి.

సెప్టెంబరు 11 నాటికి అన్ని యూఎస్ దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా గత నెలలో ప్రణాళికలు ప్రకటించినప్పటి నుంచి కాబూల్ లో ప‌రిస్థితులు విష‌మంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా తాలిబాన్లు త‌మ‌ దాడులను వేగవంతం చేశార‌ని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News