భారత్ లో కరోనా కట్టడికి ఏడీబీ భారీ ఋణం

భారత్ లో కరోనా కట్టడికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారీ ఋణం మంజూరు చేసింది.

Update: 2020-04-29 05:28 GMT

భారత్ లో కరోనా కట్టడికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారీ ఋణం మంజూరు చేసింది. వ్యాధి నిరోధకత , నివారణ వంటి తక్షణ ప్రాధాన్యతలకు, అలాగే పేద , ఆర్థికంగా బలహీన వర్గాలకు, సామాజిక రక్షణకు ఈ రుణం మంజూరు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై భారత ప్రభుత్వానికి అండగా నిలబడటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎడిబి అధ్యక్షుడు మసత్సుగు అసకావా అన్నారు.

భారత ప్రజలకు, ముఖ్యంగా పేదలు , బలహీనంగా ఉన్నవారికి సమర్థవంతమైన సహాయాన్ని అందించేలా చూసుకోవాలి" అని అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలావుంటే మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ 2020 క్యాలెండర్ సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించింది. కరోనావైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ దీనికి కారణంగా తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో కేసుల సంఖ్య మంగళావారం నాటికి 29,974 కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 937 గా నమోదైంది.


Tags:    

Similar News