అదానీ వ్యవహారంపై నిపుణల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం
Supreme Court: ఈనెల 17కు విచారణ వాయిదా
అదానీ వ్యవహారంపై నిపుణల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం
Supreme Court: దేశంలో ప్రకంపనలు రేపిన అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలపై.. నిపుణుల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ కోసం ప్యానెల్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. కమిటీ సభ్యులుగా ఎవరు ఉండాలో సూచించాలని కేంద్రం.. సుప్రీంకోర్టును కోరింది. అయితే కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్‌లో పంపాలని సుప్రీం ఆదేశించింది. రెండ్రోజుల్లో కోర్టుకు నివేదిక ఇస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై ఈనెల 17కు తదుపరి విచారణ వాయిదా వేసింది.