Ranya Rao: అక్రమ బంగారం రవాణా కేసులో నటికి ఏడాదిపాటు జైలు.. తుది తీర్పు వెల్లడి

Ranya Rao: రన్యారావుతో పాటు మరో ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది.

Update: 2025-07-17 11:19 GMT

Ranya Rao: అక్రమ బంగారం రవాణా కేసులో నటికి ఏడాదిపాటు జైలు.. తుది తీర్పు వెల్లడి

Ranya Rao: బంగారం అక్రమ కేసులో కన్నడ నటి రన్యారావు అడ్డంగా దొరికిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా తుది తీర్పు వెలువడింది. రన్యారావుతో పాటు మరో ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్షను విధించారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు ఎయిర్ పోర్టులో కన్నడ నటిపై అనుమానం వచ్చి.. ఎయిర్ పోర్టు అధికారులు చెక్ చేయగా, ఆమె దగ్గర భారీ మొత్తంలో బంగారం బయటపడింది. దీంతో ఆమెపై బంగారం అక్రమ రవాణా కేసును నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈకేసులో ఇప్పుడు తుదితీర్పు వెలువడింది. రన్యారావుతో పాటు మరో ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. అసలు ఏం జరిగిందో చూద్దాం..

రన్యారావు దుబాయ్ నుంచి బెంగుళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ముఖ్యంగా ఆమె దగ్గర 14.3 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె ఇంటిపై తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేశారు.

అలాగే ఆమెకు సహకరించిన మరో ఇద్దరు సాహిల్, తరుణ్‌లను కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు తాజాగా వీరి ముగ్గురికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.

Tags:    

Similar News