Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్..!
ఎట్టకేలకు కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్ స్పందించారు. టీవీకే అధినేత వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్..!
ఎట్టకేలకు కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్ స్పందించారు. టీవీకే అధినేత వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. శనివారం కరూర్ జిల్లాలో టీవీకే రోడ్ షో చేశారు. రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 40మంది మృతి చెందారు.
తనపై ప్రేమతోనే వాళ్లంతా రోడ్‌షోకు వచ్చారని విజయ్ తెలిపారు. కరూర్‌లో మాత్రమే ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కానీ...తమపైనే కేసులు పెట్టారని...నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులను త్వరలోనే కలుస్తానని..ఘటనను సీఎం స్టాలీన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నన్ను టార్గెట్ చేయండి..కానీ నా కార్యకర్తలను కాదని వీడియోలో విజయ్ అన్నారు.