Free Bus: మహిళల ఉచిత ప్రయాణ పథకంలో మార్పులు.. టిక్కెట్ల స్థానంలో పింక్ పాస్
Free Bus: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Free Bus: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం మహిళలకు త్వరలో పింక్ టికెట్లు తేనున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఈ ప్రయోజనం ఢిల్లీలో నివసించే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మహిళలకు ఫ్రీ బస్సుకోసం పింక్ టికెట్లు తెస్తామని ప్రకటించారు. ఆధార్ లింక్‌తో ఈ పింక్ పాస్‌లు అందిస్తామన్నారు. అయితే ఈ ప్రయోజనం ఢిల్లీలో ఉండే వాళ్లకు మాత్రమే ఉంటుంది. పాస్ కోసం అర్హత ఉన్న మహిళలందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు ఇటీవల కాలంలో మహిళలకు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించే పథకాలను తీసుకొచ్చాయి. గతంలో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికీ అదే దారిలో నడుస్తోంది. మహిళలకు సిటీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీనికోసం పింక్ పాస్‌లను ఏర్పాటు చేయనుంది. అయితే దీనికోసం ఆధార్ లింక్ అవసరం ఉంటుందని తాజాగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు.
పింక్ పాస్‌లను పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన దరఖాస్తుదారులు ఆధార్, పాన్, నివాస రుజువు, పాస్ పోర్టు సైజు ఫోటో గ్రాఫ్ మరియు పూర్తి KYC డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, దీనికోసం డిజిటల్ మరియు అడ్మనిస్ట్రేషన్ ఫ్రేమ్ వర్క్‌ను ఖారుచేస్తున్నట్లు కూడా రవాణా మంత్రి పంకజ్ సింగ్ వెల్లడించారు.
2019లో పింక్ టికెట్ పథకాన్ని ఢిల్లీ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి జనం విస్తృతంగా దీన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం నుండి ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఈ వ్యవస్థ యొక్క ఒపెన్ యాక్సెస్ స్వభావం దుర్వినియోగం అవుతుందని అధికారులు చెబుతున్నారు. స్థానికేతరులు కూడా దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని అన్నారు. అందుకే పింక్ టికెట్ స్థానంలో పింక్ పాస్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. దీన్ని దశల వారీగా ప్రారంభించి.. ఢిల్లీ మహిళలకు లాభం చేకూర్చే పనిలో ఢిల్లీ ప్రభుత్వం నిమగ్నమై ఉంది.