Nepal: నేపాల్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు
Nepal: ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
Nepal: నేపాల్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు
Nepal: నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపలతో నేపాల్ కోలుకొలేని పరిస్థితి ఏర్పడింది. హిమాలయ దేశం మృత్యుఘోష తాండవిస్తుంది. జజర్‌కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. తీవ్ర భూకంపంతో 160కి పైగా మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు.
నేపాల్‌లో ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ ప్రధాని, వైద్య బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.