సారి అతనికి జరిమానా విధించలేం...ఎందుకంటే?

Update: 2019-09-19 04:54 GMT

సెప్టెంబర్ 01 నుండి కొత్త వాహన చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.. వాటిని అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు... ఈ కొత్త వాహన చట్టాల పై వాహనదారులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... ఇది ఇలా ఉంటే వాహనదారులు నుండి పోలీసులుకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని ఉదెపూర్ జిల్లాలోని బోడెలీ ప్రాంతానికి చెందిన జాకిర్ మెనన్ అనే ఓ వ్యక్తికి బైక్ కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. కానీ హెల్మెట్ మాత్రం లేదు.. వాహన చట్టాల్లో అదే మెయిన్.. ఇలా హెల్మెట్ లేకుండా రోడ్డుపై వెళ్తూ పోలీసులుకు చిక్కాడు జాకీర్..

ఎందుకు హెల్మెట్ ధరించడం లేదు అని వారు ప్రశ్నించగా జాకీర్ చెప్పిన సమాధానం విన్నా పోలీసులు షాక్ అయ్యారు.. "నేను హెల్మెట్ పెట్టుకోలేను ఎందుకంటే మార్కెట్ లో నా తలకి సరిపడే హెల్మెట్ దొరకడం లేదు. నేను నా తలకి సరిపడే హెల్మెట్ కోసం వేతకని చోటు లేదు .నాకు చట్టాల మీదా అపారమైన గౌరవం ఉంది. హెల్మెట్ విషయంలో నేను ఎం చేయలేను" అని చెప్పుకొచ్చాడు. దీనితో ట్రాఫిక్ పోలీసులు చేసేది ఏమి లేకా అతనికి జరిమానా విధించకుండా వదిలేశారు. 

Tags:    

Similar News