మహారాష్ట్ర 'మల్లేశం'... ఐడియా అదుర్స్

Update: 2019-10-01 10:48 GMT

తెలుగులో ఇటివల వచ్చిన మల్లేశం సినిమా గుర్తుండే ఉంటుంది కదా..! ఆ సినిమాలో హీరో మల్లేశం తల్లి ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పుతుంది. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మల్లేశం ద్రుష్టిలో పడి ఎలక్ట్రానిక్ ఆసుని కనిపెడతాడు మల్లేశం.. ఇప్పుడు అలాంటి మల్లేశం కూడా మహారాష్ట్రలో కూడా ఉన్నాడు.

బోధిసత్వ గణేష్ కాండేరావు అనే ఓ 12 ఏళ్ల బాలుడు మహారాష్ట్రలో ఉన్నాడు. అతని తల్లి బాత్రూం గచ్చుకు పట్టుకున్న పాచిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆమెకి నడుము నొప్పి వచ్చింది. ఇక ఆ పని చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది చూసి బోధిసత్వ తట్టుకోలేకపోయాడు. ఎలా అయిన సరే తన తల్లికి ఊరట కల్పించాలనుకున్నాడు. ఇంతలోనే ఓ ఉపాయం వచ్చింది. స్వచ్ఛత బ్రష్‌ ని కనిపెట్టాడు. మామూలు బ్రష్‌పై చెప్పు అమర్చాడు. దీనిని వేసుకొని ఈజీగా బాత్రుంలో ఉన్నా గచ్చులను శుభ్రం చేయొచ్చు. దీనివల్ల తనకి పని ఎంతో సులువుగా ఉంటుందని బోధిసత్వ తల్లి చెప్పుకొస్తుంది. 

Full View

Tags:    

Similar News