8th Pay Commission: 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం (8th Central Pay Commission - CPC) ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
8th Pay Commission: 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం (8th Central Pay Commission - CPC) ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త వేతన సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్‌ను ఛైర్‌పర్సన్‌గా నియమించారు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 8వ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను సమర్పిస్తుంది. అనంతరం ఆ సిఫార్సుల ఆధారంగా వేతనాలు, భత్యాలు సవరించబడతాయి. ఈ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “ఈ వేతన సంఘం అమలుతో 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.9 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది” అని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 7వ వేతన సంఘం సిఫార్సులు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (DA) పెరుగుతోంది. ప్రస్తుతం అది 58 శాతం వద్ద ఉంది.
8వ వేతన సంఘం ప్రధాన లక్ష్యాలు:
కేంద్ర ఉద్యోగుల జీతాలు, భత్యాలు సమీక్షించడం
దేశ ఆర్థిక స్థితి, అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలపై దృష్టి
ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం జీతభత్యాల సరిపోలన
నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాల నిధుల వినియోగంపై పరిశీలన
ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం పరిపాటిగా ఉంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డెడ్‌లైన్:
8వ వేతన సంఘం ఏర్పాటు తేదీ నుంచి 18 నెలల్లోపు సిఫార్సులు కేబినెట్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్య:
“జనవరి 2026 నాటికి ఈ సిఫార్సులను అమలు చేయడమే మా లక్ష్యం. దీని ద్వారా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి.”