భారత కరెన్సీ నోట్లపై కనిపించే 6 అద్భుత కట్టడాలు – వీటిని ఇలా సందర్శించండి

మన దేశ కరెన్సీ నోట్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళా వైభవాలకు ప్రతీకలు కూడా. ప్రతి నోటుపై మన దేశ గర్వకారణమైన వారసత్వ కట్టడాలు ముద్రించబడి ఉంటాయి. వీటిలో చాలా UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గాను, పర్యాటక ఆకర్షణలుగానూ నిలిచాయి.

Update: 2025-08-08 16:22 GMT

భారత కరెన్సీ నోట్లపై కనిపించే 6 అద్భుత కట్టడాలు – వీటిని ఇలా సందర్శించండి

మన దేశ కరెన్సీ నోట్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళా వైభవాలకు ప్రతీకలు కూడా. ప్రతి నోటుపై మన దేశ గర్వకారణమైన వారసత్వ కట్టడాలు ముద్రించబడి ఉంటాయి. వీటిలో చాలా UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గాను, పర్యాటక ఆకర్షణలుగానూ నిలిచాయి. ఇక్కడ 6 కరెన్సీ నోట్లపై కనిపించే ప్రముఖ మాన్యుమెంట్స్, వాటి ప్రత్యేకతలు, మరియు మీరు అక్కడికి ఎలా వెళ్లాలనే ట్రావెల్ గైడ్ తెలుసుకుందాం.

₹10 నోటు – కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా

13వ శతాబ్దంలో నిర్మితమైన ఈ సూర్య దేవాలయం ఒక భారీ రథాకారంలో ఉంటుంది. 12 జతల చక్రాలు, ఏడు గుర్రాలు, కాలాన్ని సూచించే శిల్పాలు దీని ప్రత్యేకత. భువనేశ్వర్ బీజూ పట్నాయక్ ఎయిర్‌పోర్ట్‌కి 65 కి.మీ దూరంలో ఉంది.


₹20 నోటు – ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర

హిందూ, బౌద్ధ, జైన మతాల ఆలయాల సమాహారం. కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. ఔరంగాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి కేవలం 30 కి.మీ దూరంలో ఉంది.

₹50 నోటు – హంపి రాతి రథం, కర్ణాటక

విజయనగర సామ్రాజ్యపు కళా వైభవానికి నిదర్శనం. విఠల ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ రథం మ్యూజికల్ పిల్లర్స్‌కి ప్రసిద్ధి. జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్ట్ 40 కి.మీ దూరంలో ఉంది.

₹100 నోటు – రాణి కీ వావ్, గుజరాత్

11వ శతాబ్దపు అద్భుతమైన మెట్లబావి. 800కు పైగా శిల్పాలు అలరారతాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ 125 కి.మీ దూరంలో ఉంది.

₹200 నోటు – సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

బౌద్ధమత పవిత్ర స్థలమైన ఈ స్థూపం అశోక చక్రవర్తి కాలానికి చెందింది. భోపాల్ రాజా భోజ్ ఎయిర్‌పోర్ట్ 50 కి.మీ దూరంలో ఉంది.

₹500 నోటు – ఎర్రకోట, ఢిల్లీ

మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ కోట భారత స్వాతంత్ర్యానికి ప్రతీక. ఇక్కడే ప్రతి ఏడాది ఆగస్టు 15న ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది.

ఈ కట్టడాలు కేవలం నోట్లపై మాత్రమే కాకుండా, మన సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతాలు. ఒక్కో కట్టడాన్ని ప్రత్యక్షంగా చూడటం అనుభూతి మరచిపోలేనిది.

Tags:    

Similar News