Uttar Pradesh Polls: యూపీలో నేడు నాలుగో విడత పోలింగ్

Uttar Pradesh Polls: 59 అసెంబ్లీ స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్

Update: 2022-02-23 03:14 GMT

 యూపీలో నేడు నాలుగో విడత పోలింగ్

Uttar Pradesh Polls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమయ్యింది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.. మొత్తం 624 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతుంది. కీలకమైన ఫిలిబిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా ఫతేపూర్ జిల్లాల్లో నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. ఇక రైతుల‌ను కారుతో తొక్కించి చంపాడ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడి తండ్రి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ల‌ఖింపూర్ ఖేరీలోనూ పోలింగ్ జరుగుతోంది.

నాలుగో ద‌శ‌లో మొత్తం 59 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో.. కాంగ్రెస్‌, బీఎస్పీ మాత్ర‌మే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. అధికార బీజేపీ 57 స్థానాల్లో, విప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీ 58 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 58 అసెంబ్లీ స్థానాల్లో 51 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. నాలుగు స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, మూడు చోట్ల బహుజన్ సమాజ్ వాదీ పార్టీ గెలిచాయి. అప్నా దళ్ ఒక స్థానం గెలుపొందింది. అయితే, ఈసారి మాత్రం వివిధ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News