Delhi: 50 వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి

Delhi: 50 వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2021-04-16 03:50 GMT

Delhi:(File Image) 

Delhi: భారత దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ చుట్టేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా రోగులతో ఆసుప్రతులు నిండి పోతున్నాయి. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులు అనే తేడా లేకుండా కరోనా రోగులతో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత అవసరాల దృష్ట్యా 50 వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో గురువారం సమావేశమైన సాధికార బృందం ఈ నిర్ణయం తీసుకొంది. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నదీ త్వరగా గుర్తించాలని విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని రాయబార కార్యాలయాలను నిర్దేశించింది.

దేశంలోని 100 ఆసుపత్రుల్లో సొంతంగా ఆక్సిజన్‌ తయారు చేసుకొనేలా ప్రోత్సహించనున్నారు. పీఎం కేర్స్‌ కింద ఇప్పటికే మంజూరుచేసిన 162 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించి దాన్ని వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో 100 ఆసుపత్రులను గుర్తించి అక్కడ పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సాధికార బృందం అధికారులను ఆదేశించింది.

Tags:    

Similar News