పాము కోసం నిప్పు పెడితే చిరుత పులులు సజీవదహనం

Update: 2019-04-04 04:05 GMT

పాము కోసం నిప్పు పెడితే ఐదు చిరుత పులులు సజీవధానమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గోపినాథ్ గునాగేకు చెరకు తోట ఉంది. ఇటీవల చెరకు కోసేందుకు చక్కెర కర్మాగారానికి చెందిన కూలీలు ఆ తోటకు వచ్చారు. అయితే కొద్దిరోజులుగా చెరకు తోటలో అత్యంత విషపూరిత పాము సంచరిస్తుంది. అది కూలీలకు కనిపించింది.

దీంతో పామును చంపేందుకు చెరకుతోటలో నిప్పంటించారు. అంతే తోట కాలాక చూస్తే రోజుల వయసున్న ఐదు చిరుతపులి పిల్లల మృతదేహాలు కనిపించాయి. రెండు మగ, మూడు ఆడ చిరుతపులి పిల్లలు మంటల్లో సజీవదహనమయ్యాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పులి పిల్లల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించి వాటిని పూడ్చిపెట్టారు.

Similar News