Corona Cases In India: 24 గంటల్లో దేశంలో 43,509 మందికి పాజిటివ్
Corona Cases In India: రెండోరోజు 40 వేలకు పైగా కేసులు * కేరళలో 22 వేల కేసులు నమాదు
Representational Image
Corona Cases in India: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. వరుసగా రెండోరోజు పాజిటివ్ కేసులు 40వేలు దాటాయి. మొన్న 30వేలకు దిగువన నమోదైన కేసులు ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి.మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. రికవరీ కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
24 గంటల్లో దేశంలో 43,509 మందికి పాజిటివ్ వచ్చింది.6వందల 40 మంది చనిపోయారు. కేరళలో 22వేల కేసులు, మహారాష్ట్రలో దాదాపు 7వేల కేసులు రికార్డ్ అయ్యాయి. కొత్త కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే సగానికపైగా ఉంటున్నాయి. రికవరీ రేటు కన్నా కేసులు ఎక్కవగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 24 గంటల్లో 38వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.