Corona Cases in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

* గడిచిన 24గంటల్లో 41,831 మందికి పాజిటివ్ * కోవిడ్‌తో మరో 541 మంది మృతి * రివకరీల కంటే కొత్త కేసులు ఎక్కువ

Update: 2021-08-01 05:13 GMT

Representation Photo

Corona in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇంతవరకు కొత్త కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ, ఇవాళ మాత్రం రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో 17 లక్షల 89 వేలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 41 వేల 831 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనాతో మరో 541 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 24 వేల 351కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 39 వేల 258 మంది కరోనాను జయించారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 3 కోట్లు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 10 వేల 952కు పెరిగింది. ఆ రేటు 1.30శాతానికి చేరింది. మరోవైపు టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ నిర్దేశించింది. 46 జిల్లా్ల్లో 10శాతానికి పైగా, 53 జిల్లాల్లో 5 నుంచి 10శాతం మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News