Corona Cases in India: భారత్‌లో కొత్తగా 41,195 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశవ్యాప్తంగా 3,20,76,976కి చేరిన కరోనా కేసులు * దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 4,29,702 మంది మృతి

Update: 2021-08-12 04:36 GMT

Representational Image

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఈ సంఖ్య 38వేల 353గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల, 87వేల, 987 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా కేరళలో 23వేల 500 కేసులు నమోదుకాగా  5వేల 560 కొవిడ్ కేసులతో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉంది. కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.

Tags:    

Similar News