Representation Photo
Corona Cases in India: భారత్‌లో కొత్తగా 40వేల ,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 585 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 42వేల,295 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3 కోట్ల, 13లక్షల, 2వేల, 345కి చేరుకుంది. భారత్‌లో ప్రస్తుతం 3లక్షల, 85వేల, 227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.