Delhi Police malkhana: పోలీసు మాల్‌ఖానాలో అగ్ని ప్రమాదం.. 300కు పైగా వాహనాలు బుగ్గి

Update: 2025-04-06 16:22 GMT

Delhi Police malkhana: పోలీసు మాల్‌ఖానాలో అగ్ని ప్రమాదం.. 300కు పైగా వాహనాలు బుగ్గి

Fire accident at Delhi Police malkhana: ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉన్న ఢిల్లీ పోలీసుల మాల్‌ఖానాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 345 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తగలబడిపోయిన వాహనాల్లో 260 వాహనాలు ద్విచక్ర వాహనాలు కాగా మరో 85 కార్లు ఉన్నాయి.

ఆదివారం తెల్లవారిజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 7 ఫైర్ ఇంజన్లతో వెంటనే అక్కడికి చేరుకుంది. 2 గంటలపాటు శ్రమించిన తరువాతే మంటలు అదుపులోకి వచ్చాయి. 

గత 3 రోజుల్లో ఢిల్లీ పోలీసు మాల్‌ఖానాలో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ప్రస్తుతానికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మరోసారి అగ్ని ప్రమాదానికి తావులేకుండా ఆ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.  

Tags:    

Similar News