జమ్మూ కాశ్మీర్‌లో 3.2 తీవ్రతతో భూప్రకంపన

జమ్మూ కాశ్మీర్‌ లో భూప్రకంపన సంభవించింది. ఇది రిక్టర్ స్కెలుమీద 3.2 తీవ్రతగా నమోదయింది.

Update: 2020-06-15 05:48 GMT

జమ్మూ కాశ్మీర్‌ లో భూప్రకంపన సంభవించింది. ఇది రిక్టర్ స్కెలుమీద 3.2 తీవ్రతగా నమోదయింది. సోమవారం తెల్లవారుజామున 4.36 గంటలకు ఐదు కిలోమీటర్ల లోతులో భూప్రకంపన సంభవించిందని, అయితే దీని ప్రభావంతో ఎక్కడా ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రకంపనలతో ఇళ్లలో అటక మీద ఉన్న వస్తువులు ఒక్కసారిగా కింద పడ్డాయి. దాంతో ఉలిక్కిపడి లేచిన జనం బయటకు పరుగులు తీశారు. అయితే పెద్దగా ప్రమాదం ఏమి లేకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా దీని ఈ భూ ప్రకంపనకు ఎక్కడా ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలుస్తోంది. ఇదిలావుంటే గత రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అసలే కరోనాతో కలవరానికి గురవుతుంటే.. భూకంపం మరింత ఆందోళనకు గురిచేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News