Bridge Collapsed: కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి
Bridge Collapsed: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Bridge Collapsed: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో వంతెనపై ప్రయాణిస్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. నలుగురిని వాహనాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రక్షణ, శోధన చర్యలు కొనసాగుతున్నాయి.
వంతెన చాలా పాతదని, పైగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఇది కూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వడోదర-ఆనంద్ పట్టణాలను అనుసంధానించే ఈ వంతెన కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలిపింది.