Corona Deaths: భారీ సంఖ్యలో నమోదైన కరోనా మరణాలు

Corona Deaths: అయితే మరణాల సంఖ్య మాత్రం ఇటీవల ఎప్పుడు చూడని విధంగా భారీ సంఖ్యలో నమోదైంది.

Update: 2021-12-05 06:12 GMT
Representational Image

Corona Deaths: భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఇటీవల ఎప్పుడు చూడని విధంగా భారీ సంఖ్యలో నమోదైంది. ఇందుకు కారణం పలు రాష్ట్రాలు ఆ సంఖ్యను సవరించడమే. గడిచిన 24 గంటల్లో 12లక్షల, 26వేల, 64 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 8వేల, 895 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇక నిన్న ఒక్క రోజే 2వేల796 మరణాలు నమోదయ్యాయి. బిహార్‌, కేరళ రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడంతో ఆ సంఖ్య ఈ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. బీహార్‌లో నిన్న 2వేల, 426 మరణాలు నమోదైనట్లు పేర్కొనగా... కేరళలో 263 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన మరణాల సంఖ్య 4 లక్షల, 73వేల, 326కి చేరాయి.

ఇక నిన్న 6వేల 918 మంది కరోనాను జయించగా ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటి, ఆ రేటు 98.35 శాతానికి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 99వేల,155గా ఉండి.. ఆ రేటు 0.29 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే ఒక కోటి, 4లక్షల, 18వేల, 707 మందికి టీకా అందించగా ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 127 కోట్లు దాటింది.

ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో కర్ణాటకలో రెండు నమోదు కాగా గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఒక్కో కేసు నమోదైంది. మరికొంత మంది అనుమానితుల టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది.

కొవిడ్‌ కేసుల రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలంటూ ఈ మేరకు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మిజోరం,జమ్ముకశ్మీర్‌లకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు.

Tags:    

Similar News