Corona Cases in India: భారత్ లో కొత్తగా 25,072 కరోనా కేసులు

* తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. * క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది.

Update: 2021-08-23 06:30 GMT

Representation Photo

Corona Cases in India: భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా 389 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు.

మొత్తం రికవరీలు 3.16 కోట్ల(97.63 శాతం)కు చేరాయి. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924(1.03 శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది.

Tags:    

Similar News