Kerala: కేరళలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి
Kerala: దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ * ఒక్కరోజే 20,452 కరోనా కేసులు, 114 మరణాలు
Representational image
Kerala: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. పక్షం రోజులుగా 20 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.8 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,452 కరోనా కేసులు, 114 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36లక్షల 52వేల 90కు, మొత్తం మరణాల సంఖ్య 18వేల 394కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 16వేల 856 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.