Corona Cases in India: భారత్‌లో కరోనా విజృంభణ

Corona Cases in India: 10.21శాతంగా రోజువారీ పాజిటివిటీ రేటు

Update: 2022-01-09 05:28 GMT

భారత్‌లో కరోనా విజృంభణ

Corona Cases in India: భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్‌ విజృంభణతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ కేసులు లక్షన్నర దాటాయి. కేసులతోపాటు పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతుండటంతో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రాలు క్రమంగా కరోనా ఆంక్షలను రెట్టింపు చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా లక్షా 59వేల 632 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3కోట్ల 55లక్షల 28వేల 4కు చేరాయి. ఇందులో 3కోట్ల 44లక్షల 53వేల 603 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా.. 5లక్షల 90వేల 611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో 327 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 151.58 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా దేశంలో విజృంభిస్తోంది. తాజాగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3వేల 623కి పెరిగింది.

ప్రస్తుతం వేయి 409 మంది ఒమిక్రాన్‌ బాధితులు కోలుకున్నారని కేంద్రం తెలిపింది. మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో వేయి 9కేసులు ఉండగా, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్‌లో 373, కేరళలో 204, తమిళనాడులో 185, హర్యానా, తెలంగాణలో 123 చొప్పున నమోదయ్యాయి.

Tags:    

Similar News