Corona Cases in India: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 1,68,063 మందికి పాజిటివ్

Update: 2022-01-11 05:50 GMT

 దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండోరోజు లక్షన్నర కేసులు దాటాయి. కొత్తగా 1.68 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో చికిత్స పొందుతూ మరో 277 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి 69వేల 959 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 8.21 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.64 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో 33వేలు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో 19వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి చూపిస్తోంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.58 కోట్ల మందికి వైరస్ సోకింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 4వేల 461 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 12వందల 47 మంది ఈ వేరియంట్ బారిన పడగా, రాజస్థాన్‌లో 645, ఢిల్లీలో 546 మందికి ఒమిక్రాన్ సోకింది. ఉంది.

Tags:    

Similar News