కుంభమేళ ఎఫెక్ట్: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 15 మంది మృతి
Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 15 మంది ప్రయాణికులు మరణించారు.
కుంభమేళ ఎఫెక్ట్: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 15 మంది మృతి
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రయోగరాజ్ లో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు వందల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారమ్ నెంబర్ 14, 15 నెంబర్లో భారీ తొక్కిసలాట జరిగింది. వందలాది మంది స్పృహ కోల్పోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయోగరాజ్ కు రెండు ప్రత్యేక రైళ్లను అధనంగా వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఊహించిన దానికంటే ఎక్కువమంది ప్రయాణికులు తరలివచ్చారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు తొక్కిసలాటలో మరణాలు జరిగినట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెప్ట్ నెంట్ గవర్నర్ ధృవీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీనీ నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీకరణంగా ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ప్రధాని మోడీ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగాకోలుకోవాలని ఆకాంక్షించారు.