Bihar Lockdown: బీహార్ లో 15 వరకు లాక్ డౌన్

Bihar Lockdown: బీహార్లో రోజుకు 13 వేల పైన కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-05-04 11:03 GMT

బీహార్ లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)

Bihar Lockdown: బీహార్లో రోజుకు 13 వేల పైన కరోనా కేసులు నమోదవుతున్నాయి. పరిస్ధితి సమీక్షించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మే 15 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా సీఎం ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పక్కనే ఉన్న జార్ఖండ్ లాక్ డౌన్ ప్రకటించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, హర్యానా, ఒడిశాలు కూడా లాక్ డౌన్ ప్రకటించాయి. సోమవారం కేబినెట్ లో చర్చించాకే ఈ ప్రకటన జారీ చేశారు. అయితే ప్రజలను ప్రిపేర్ చేయడానికి.. ముందు రోజే లీకులిచ్చారు. దీంతో జనమంతా లాక్ డౌన్ కు మానసికంగా సిద్ధపడ్డారు.

లాక్ డౌన్ పై వివరణాత్మక మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోవిడ్ సంక్షోభ నిర్వహణ బృందానికి సూచించామని సీఎం నితీశ్ వెల్లడించారు. బిహార్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ అమలుకు నితీశ్ మొగ్గుచూపారు. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 11వేల407 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో బీహార్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

Tags:    

Similar News