ఛత్తీ‌స్‌‌గఢ్‌లో ఎదురుకాల్పులు: కీలక నాయకుడు చలపతి సహా 20 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మరణించారు.మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి

Update: 2025-01-21 06:11 GMT

ఛత్తీ‌స్‌‌గఢ్‌లో ఎదురుకాల్పులు: కీలక నాయకుడు చలపతి సహా 14 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20మంది మావోయిస్టులు మరణించారు.మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి. చలపతిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా. మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చలపతి ఉన్నారు. ఆయనపైగతంలో కోటి రూపాయాల రివార్డు ఉంది.చలపతితో పాటు ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్,స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.ఛత్తీస్‌గఢ్ , ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ను ప్రారంభించాయి.కులరిఘాట్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.రెండు రోజలుగా మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్ లో గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్ఓజీ , 207 కోబ్రా దళాలు పాల్గొన్నాయి. సుమారు వెయ్యి మంది భద్రతా బలగాలు మావోయిస్టు కోసం గాలింపు చేపట్టాయి.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడ ప్రాంతాల్లోని అడవుల్లో రెండు రోజులుగా భద్రతా బలగాలు కూంబింగ్ ను చేపట్టాయి. జనవరి 20న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. జనవరి 21న పోలీసుల గాలింపులో 18 మృతదేహలను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎవరీ చలపతి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరిలో ఆయనపై మావోయిస్టులు  దాడి చేశారు. ఈ దాడి ఘటనలో చలపతి కీలకంగా వ్యవహరించారు. అలిపిరి దాడి ఘటనలో చంద్రబాబు తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు.  మావోయిస్టులు అప్పట్లో ఉపయోగించిన మందుపాతరకు ఉపయోగించిన పేలుడు పదార్ధాలు పూర్తిగా పేలకపోవడంతో ఈ ప ్రమాదం నుంచి చంద్రబాబు బయటపడినట్టుగా అప్పట్లో పోలీసులు గుర్తించారు. 

Tags:    

Similar News