Tamil Nadu: 13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయులు అత్యాచారం..గర్బం దాల్చడంతో వెలుగులోకి వచ్చిన విషయం

Update: 2025-02-06 05:44 GMT

Odisha: ప్రియుడిని నిర్బంధించి.. యువతిపై 10 మంది గ్యాంగ్‌రేప్‌..!!

Tamil Nadu: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి..వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. తల్లిదండ్రుల తర్వాతి స్థానంలో ఉన్న గురువులు..ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అభంశుభం తెలియని 13ఏళ్ల బాలిక గర్బం దాల్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల విద్యార్థిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణగిరి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

వారి కామవాంఛకు ఆ చిన్నారి బలై గర్భం దాల్చింది. తమ కుమార్తెకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పుకోలేక..నిస్సాహాయులైన ఆమె తల్లిదండ్రులు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించారు. పోచంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గత నెల రోజుల నుంచి పాఠశాలకు వెళ్లలేదు. దీంతో ఏం జరిగిందోనని ఈ స్కూల్ హెడ్ మాస్టర్ తోటి విద్యార్థులను అడిగారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాలిక ఇంటికి వెళ్లారు. చివరకు ఆమె తల్లిచెప్పిన మాటలు విని వాళ్లు నిర్ఘాంతపోయారు. తమ కుమార్తె గర్భం దాల్చిందని..అబార్షన్ చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు.

బాలిక తల్లి చెప్పిన మాటలు విని హెడ్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఓ డిగ్రీ టీచర్ తన పై దారుణానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. దీంతో శిశుసంక్షేమ సంరక్షణ అధికారులకు బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించారు. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురిని గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 

Tags:    

Similar News