Hyderabad Laddu: అయోధ్య‌కు చేరుకున్న 1265 కేజీల హైద‌రాబాదీ ల‌డ్డూ

Hyderabad Laddu: 350 కేజీల శ‌న‌గ పిండి, 700 కేజీల చ‌క్కరతో లడ్డూ తయారీ

Update: 2024-01-20 05:59 GMT

Hyderabad Laddu: అయోధ్య‌కు చేరుకున్న 1265 కేజీల హైద‌రాబాదీ ల‌డ్డూ

Hyderabad Laddu: తెలుగు రాష్ట్రాల్లోని రామ భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. హైదరాబాద్‌ లోని శ్రీరామ్ క్యాట‌రింగ్ స‌ర్వీసెస్ ఓన‌ర్ ఎన్ నాగ‌భూష‌ణం రెడ్డి త‌యారు చేసిన భారీ ల‌డ్డూ ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బ‌రువు ఉన్న ఆ ల‌డ్డూ క‌ర‌సేవ‌క్‌పురంకు చేరుకున్నట్లు ఆయ‌న తెలిపారు. క్యాట‌రింగ్ వ్యాపారంపై, త‌న ఫ్యామిలీపై రాముడి ఆశీస్సులు ఉన్నాయ‌ని, బ్రతికి ఉన్నంత కాలం రాముడి కోసం ప్రతి రోజు ఒక కేజీ ల‌డ్డూ త‌యారు చేయాల‌ని కాంక్షించాన‌ని నాగ‌భూష‌ణం తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన ల‌డ్డూకు సంబంధించిన ఫుడ్ స‌ర్టిఫికేట్‌ను కూడా తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. తాము త‌యారు చేసిన ల‌డ్డూలు నెల రోజులు వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటాయ‌న్నారు. మూడు రోజుల పాటు 25 మంది ఆ అఖండ ల‌డ్డూను త‌యారు చేసిన‌ట్లు చెప్పారు

ఈనెల 17న హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక వాహ‌నంలో ఈ లడ్డూను ఆయోధ్యకు తరలించారు. 350 కేజీల శ‌న‌గ పిండి, 700 కేజీల చ‌క్కర‌, 40 కిలోల కాజూ, 25కేజీల బాదాం, 4 కిలోల కిస్‌మిస్‌, 40 కిలోల నెయ్యి, 15 కిలోల నూనె, కుంకుమ పువ్వు, ప‌చ్చ క‌ర్పూరంతో ఈ ల‌డ్డూను తయారు చేశారు.

Tags:    

Similar News