AP: తిరుపతి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం
కర్ణాటకలోని యాలాపూరా హైవేపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూరగాయలు అమ్మేందుకు సావనూరు నుంచి కుంత మార్కెట్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి టిప్పర్ ను ఢీకొట్టి 50 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 30 మంది ప్రయాణం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. హవేరీ జిల్లాలోని సావనూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధికారులు డ్రైవర్లకు పలు సూచనలు చేస్తున్నారు. అయితే కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు నిద్రమత్తులో వాహనాలు నడపడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు.